Header Banner

కాల్పుల విరమణ! భారత్ షరతులు, కీలక మలుపు!

  Sun May 11, 2025 17:05        India

ఆపరేషన్ సింధూర్. భారత్ ఆర్మీ పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్ర శిబిరాలను నేల మట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు పెట్టింది. ఆ తరువాత పాక్ ఒక్క సారిగా డ్రోన్ లతో భారత్ లోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్రయత్నించింది. వాటిని ధీటుగా తిప్పి కొట్టిన భారత్ పాక్ లోని రక్షణ కేంద్రాల పైన ప్రతి దాడి చేసింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వేళ అమెరికా చొరవ తీసుకొని రెండు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించింది. ఫలితంగా రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ అధికారుల సమావేశంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్దం అయింది.

కీలక చర్చలు

భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ లో భాగంగా రేపు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల "మిలిటరీ ఆపరేషన్స్" డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం రెండు దేశాల మధ్య భవిష్యత్ రక్షణ - ఉద్రిక్తతల నివారణకు తొలి అడుగుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. హాట్‌లైన్‌లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలట రీ ఆపరేషన్స్‌ లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం లాంటి అంశాల గురించి చర్చించనున్నట్లు తెలు స్తోంది. శనివారం ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ.. పాకిస్థాన్‌ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది.


ఇది కూడా చదవండిచిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

సమీక్ష

పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించి సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు యత్నించింది. కానీ మళ్లీ భారత్‌ వీటిని తిప్పికొట్టింది. దీంతో సోమవారం జరగబోయే చర్చల్లో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన అంశంపై కూడా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ సమయం లోనే భారత్‌ DGMOతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్‌లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణను అమ లు చేద్దామని కోరారు. ఆ తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడా రు. ఆ తరువాత ట్రంప్ ప్రకటన.. వరుసగా భారత్ - పాక్ కాల్పుల విరమణ ప్రకటనల తో తిరిగి పూర్వ పరిస్థితులు సరిహద్దుల్లో నెలకున్నాయి. కాగా, ఈ చర్చలు.. పాక్ తో భవిష్యత్ ప్రణాళికల పైన ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు.


షరతులు

కాల్పుల విరమణ వేళ జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తమ వైఖరి స్పష్టం చేసేందుకు సిద్దం అవుతోంది. ఉగ్రవాదుల విషయంలో భారత్ కఠినంగా ఉంటామనే సంకేతాలు ఇవ్వనుంది. ఇదే సమయంలో పాక్ లో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులను అప్పగించే అంశం పైన భవిష్యత్ లోనూ పట్టుబట్టాలని భావిస్తోంది. ప్రధాని వద్ద జరిగిన సమావేశంలో పాకిస్థాన్‌పై ఎలాంటి షరతులు విధించాలి, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఒక వేళ మన షరతు లకు పాకిస్థాన్‌ ఒప్పుకోకుంటే ఎలాంటి నిర్ణయాలు వెల్లడించాలనే అంశం పైన నిర్ణయానికి వచ్చి నట్లు సమాచారం. పాక్ పైన దౌత్య పరంగా..సైనిక చర్యల ద్వారా భారత్ పెంచిన ఒత్తిడిని కొనసాగించి..పై చేయి సాధించేలా భారత్ వ్యూహాలు అమలు చేస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Ceasefire #IndiaPakistan #BorderPeace #TurningPoint #IndiaStance